PUNE ACCIDENT: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కులో మంటలు
X
మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - బెంగళూరు హైవేపై ఓ ట్రక్కు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత కంటైనర్ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని ట్రక్కులోని నలుగురు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్వామి నారాయణ దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ట్రక్కు సాంగ్లీ నుంచి గుజరాత్కు వెళ్తోందని పోలీసులు తెలిపారు.
ట్రక్కు స్వామినారాయణ మందిర్ చౌక్ సమీపంలో అదుపుతప్పి మరో లారీని ఢీకొని బోల్తా పడింది. ఆ తర్వాత కంటైనర్ వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న ఆరుగురిలో నలుగురు మరణించగా.. ఇద్దరికి గాయాలుయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందించాం’’ అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.