Home > జాతీయం > టామాటాలకు దొంగల గండం..ఏకంగా లారీనే మిస్సింగ్

టామాటాలకు దొంగల గండం..ఏకంగా లారీనే మిస్సింగ్

టామాటాలకు దొంగల గండం..ఏకంగా లారీనే మిస్సింగ్
X

టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత నెల రోజులుగా ధర 150కి తగ్గడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే టమాట ధర సెంచరీ దాటేసింది. దీంతో మిడిల్ క్లాస్ ప్రజలు టమాట కొనేందుకు వెనకడుగువేస్తున్నారు. ఓ వైపు పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతుంటే, రైతులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. టమాటాకు కనీవిని ఎరుగని రీతిలో ధర పలుకుతుండటంతో దొంగలు కూడా వాటిపై కన్నేశారు. ఈ మధ్య తరచుగా టమాటా తోటల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. టమాటా లోడ్‎తో వెళ్లే ట్రక్కులను సైతం దొంగలు లూటీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‎లో జరిగింది. రూ.21 లక్షల విలువైన 11 టన్నుల టమాటా లోడుతో కర్ణాటక నుంచి రాజస్థాన్‌కు వెళుతున్న లారీ కనిపించకుండా పోయింది. వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోలార్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.

కర్ణాటకలోని శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్‌కు చెందిన మునిరెడ్డి, జైపూర్‌లోని ముగ్గురు వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో గురువారం 11 టన్నుల టమాటాల లోడుతో లారీ రాజస్థాన్‌‎లోని జైపుర్‌‎కు బయల్దేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ టోల్‌ గేట్‌ దాటినట్లు వ్యాపారికి డ్రైవర్ సమాచారం అందించాడు. ఆదివారం రోజు లారీ ఎక్కడుందో తెలుసుకునేందుకు మునిరెడ్డి, డ్రైవర్‎కు కాల్ చేయగా నంబర్‌ అందుబాటులో లేదని వచ్చింది. లారీకి ఏర్పాటు చేసిన జీపీఎస్ ట్రాకర్ కూడా లోకేషన్‌ చూపించకపోవడంతో ఆందోళనతో వ్యాపారి కోలార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీకీ యాక్సిడెంట్ అయ్యిందా? లేదా నెట్‌వర్క్ లేకపోవడం వల్ల డ్రైవర్‌ ఫోన్‌ కలవడం లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Updated : 31 July 2023 2:42 PM IST
Tags:    
Next Story
Share it
Top