టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ జనానికి నిరాశ..
X
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు టమాటాల కోసం పరుగులు తీశారు. అయితే అప్పటికే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై ఆదివారం సాయంత్ర టమాటా లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కర్ణాటకలోని చింతామణి నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు టమాటాలు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తా పడింది. లారీ క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. అయితే అదృష్టవశాత్తూ అతను స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
లారీలో రూ.11లక్షల విలువ చేసే టమాటాలు ఉన్నట్లు డ్రైవర్ చెప్పాడు. టమాటా లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు లారీ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే పోలీసులు అక్కడకు రావడంతో వారికి నిరాశే ఎదురైంది. టమాటాల కోసం ఎగబడిన జనాలను పోలీసులు చెదరగొట్టారు.