Home > జాతీయం > మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. చితక్కొట్టిన సెక్యూరిటీ...

మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. చితక్కొట్టిన సెక్యూరిటీ...

మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. చితక్కొట్టిన సెక్యూరిటీ...
X

గతంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇంక్ చల్లడం, చెప్పు విసరడం, పెప్పర్ స్ప్రే వంటి దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ వ్యక్తి మంత్రి తలపై పసుపు పోసి నిరసన తెలిపాడు. ఉన్నట్టుండి పసుపు పోయడంతో మంత్రితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత మంత్రి సెక్యూరిటీ సదరు వ్యక్తిని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రిజర్వేషన్‌లను డిమాండ్ చేస్తున్న ఓ వర్గానికి చెందిన ప్రజలను మంత్రి విఖే పాటిల్ ఇవాళ కలిశారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రికి ఒక లేఖను ఇవ్వగా.. ఆయన దానిని చదువుతున్నారు. అంతలోనే వారిలో ఒకరు తన జేబులో నుంచి పసుపు తీసి.. పాటిల్‌ తలపై పోశాడు. దీంతో అవాక్కైన మంత్రి వెంటనే అతడికి దూరం జరిగారు. మంత్రి సిబ్బంది, అనుచరులు అతడిని చితక్కొట్టారు. మరోపక్క దెబ్బలు తింటూ కూడా ఆ వ్యక్తి రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలు చేశారు.

తన వర్గం ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మంత్రిపై పసుపు చల్లినట్లు శేఖర్ బంగలే తెలిపారు. తమకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే పసుపు సంతోషానికి గుర్తు అని.. అందులో తనకు ఏ తప్పు కన్పించలేదని మంత్రి చెప్పారు. నిరసనకారుడిపై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదని స్పష్టంచేశారు.


Updated : 8 Sept 2023 5:35 PM IST
Tags:    
Next Story
Share it
Top