Home > జాతీయం > పరిశుభ్రం అవుతున్న గంగానది నీరు

పరిశుభ్రం అవుతున్న గంగానది నీరు

పరిశుభ్రం అవుతున్న గంగానది నీరు
X

మన దేశంలో అన్నింటికంటే ముఖ్యమైన నది గంగ. మనకున్న నదులన్నింటినీ దేవతలతో సమానంగా పూజించినా...గంగకు అగ్ర తాంబూలం ఇస్తారు. ఒక్కసారి గంగలో మునిగితే చాలు సర్వపాపాలు పోతాయి అంటారు. కానీ గంగలో మునిగే సర్వరోగాలు అంటుకుంటాయి. ఎందుకంటే ఎక్కడో హిమాలయాల్లో పుట్టి అనంతవాహినిగా ప్రవహిస్తున్న గంగానది అంతలా కలుషితమైపోయింది. అందుకే దీన్ని మళ్ళీ పవిత్రంగా, స్వచ్ఛంగా చేయడానికి పూనుకుంది ప్రభుత్వం. అందులో భాగంగానే తాబేళ్ళను నదిలో వదులుతోంది. కలుషిత నీటికి, తాబేళ్ళకు సంబంధం ఏంటి? అవేం చేస్తాయి అని ఆలోచిస్తున్నారా...ఇది చదివేయండి మీకే అర్ధం అవుతుంది.

దేశంలో ఉన్న నదులన్నింటినీ స్వచ్ఛంగా చేయడానికి మోదీ ప్రభుత్వం నడు బిగించింది. ఇందులో బాగంగానే రానున్న రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్ ,వారణాసి జిల్లాల్లోని గంగానదిలో వేల తాబేళ్ళను వదలనుంది. ఇంతకు ముందే వారణాసిలో ఏర్పాటు చేసిన తాబేళ్ళ సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాంలోని వాటిని తీసుకొచ్చిన గంగలో విడిచిపెట్టనున్నారు. నమామి గంగే కార్యక్రమంలో భాంగా ఇదంతా చేస్తున్నారు. అటవీశాఖ, భారత వన్యప్రాణుల విభాగం కలిసి ఈ పని చేస్తున్నాయి. 1980లో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు గంగలో 40 వేల తాబేళ్ళను విడిచిపెట్టారు. 2017లో 5 వేల ఉభయచరాలను వదిలారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1000 తాబేళ్ళను విడిచిపెట్టారు. ఇవి నదిలో చేరిన తర్వాత సంతానాభివృద్ధి చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఆ 40వేలు...పిల్లలతో కలిపి ఇంకా ఎక్కువ అయ్యాయి.

గంగానది పవిత్రమైనది అన్న భావనతో...నదిలో స్నానం, సంతర్పణ వదలడం, పితృకార్యక్రమాలు చేయడం, పువ్వులు, ప్రసాదాలు విడిచిపెట్టడం లాంటివి అనాదిగా చేస్తూ వస్తున్నారు. అంతేకాదు వారణాసి లాంటి ప్రాంతాల్లో సగం కాలిన మృతదేహాలను కూడా గంగలో పారేస్తారు. చనిపోయిన వాళ్ళకు పుణ్యం వస్తుందనే ఆలోచనలో. దీంతో గంగానది అంతా కలుఫితం అయిపోయింది. హిమాలయాల్లో పుట్టి స్వచ్ఛంగా...తెల్లని పాలల్లో పారే గంగానదీ నీళ్ళు ఇక్కడకు వచ్చేసరికి మురికికూపంలా తయారవుతున్నాయి. కొన్నళ్ళు అయ్యేసరికి అస్సలు గంగను ఉపయోగించలేకుండా అయిపోతుంది దీనివల్ల. ఆ పరిస్థితి రాకూడదనే తాబేళ్ళను విడిచిపెడుతున్నారు. నీటిని శుభ్రంగా చేయడంలో తాబేళ్ళు కీలకపాత్ర పోషిస్తాయి. నదిలోని వ్యర్థపదార్ధాలను అవి తింటాయి. దానివల్ల నీరు పరిశుభ్రంగా అవుతున్నాయి. తాబేళ్ళ సంతానోత్పత్తితో ఈ పని మరింత మెరుగ్గా అవుతోంది. అందుకే ఇంకా ఎక్కువ తాబేళ్ళను వదలాలని ప్రభుత్వం బావిస్తోంది.

Updated : 12 July 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top