Home > జాతీయం > Viral News : ప్రియుడితో సీక్రెట్గా పెళ్లి.. ఖర్చులకు పైసల్లేవని ఏం చేసిందంటే..

Viral News : ప్రియుడితో సీక్రెట్గా పెళ్లి.. ఖర్చులకు పైసల్లేవని ఏం చేసిందంటే..

Viral News : ప్రియుడితో సీక్రెట్గా పెళ్లి.. ఖర్చులకు పైసల్లేవని ఏం చేసిందంటే..
X

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో రెండ్రోజుల క్రితం యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆమె ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే కేసు దర్యాప్తులో దిమ్మదిరిగే నిజాలు బయటపడ్డాయి. యువతి కిడ్నాప్ వెనుక అసలు కథ తెలిసి పోలీసులతో పాటు ఆమె తల్లిదండ్రులు అవాక్కయ్యారు.

కాన్పుర్కు చెందిన హన్సికా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మంచి మార్కులు రావడంతో ఐఐటీ రూర్కీలో అడ్మిషన్ దొరికింది. కాలేజీలో జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలో ఆమె ఇంటి నుంచి మాయమైంది. అనంతరం ఆమె తండ్రి మొబైల్ కు వాట్సప్ వీడియో మెసేజ్ వచ్చింది. అందులో హన్సిక తాళ్లతో కట్టేసి ఉంది. అనంతరం హన్సిక తండ్రికి కాల్ చేసిన కిడ్నాపర్లు కూతురు ప్రాణాలతో కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూతురు వీడియో, కిడ్నాపర్ల ఫోన్ కాల్ తో భయపడిపోయిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హన్సిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో అది కిడ్నాప్ డ్రామా అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. తన ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హన్సిక ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలింది. హన్సిక స్వయంగా ఈ బెదింరిపు వీడియోను తండ్రికి పంపి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది.

కిడ్నాప్ నాటకం ఆడిన హన్సికతో పాటు ఆమె ప్రియుడు రాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వాళ్ల మ్యారేజ్ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో హన్సిక, రాజ్ సింగ్ లు మే 22న వివాహం చేసుకున్నట్లు ఉంది. ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ప్రేమకు తర్వాత పెళ్లికి దారితీసిందని పోలీసులు చెప్పారు.



Updated : 7 Aug 2023 2:08 PM IST
Tags:    
Next Story
Share it
Top