BJP Final List : బీజేపీ ఐదో జాబితాలో ట్విస్టులే ట్విస్టులు
X
తమ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ ఈరోజు(శుక్రవారం) ఉదయం తుది జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. ఆ తర్వాత కాసేపటికే లిస్ట్ లో మార్పులు చేసింది. 14 మందితో విడుదల చేసిన జాబితాలో రెండు స్థానాలకు అభ్యర్థులను మార్చేసింది. ముందుగా బెల్లంపల్లి, ఆలంపూర్ స్థానాలకు కొయ్యల ఎమాజీ, మీరమ్మలను అభ్యర్థులుగా ప్రకటించింది బీజేపీ. అయితే నిమిషాల వ్యవధిలో ఆ ఇద్దరిని తమ లిస్ట్ నుంచి మరో అభ్యర్థులకు జాబితాలో చోటు కల్పించింది. బెల్లంపల్లి స్థానానికి కొయ్యల ఎమాజీకి బదులు బెల్లంపల్లి శ్రీదేవి పేరును, ఆలంపూర్ స్థానానికి మీరమ్మకు బదులుగా రాజగోపాల్ గా ప్రకటించింది.
బెల్లంపల్లిలో నిన్ననే బీజేపీ అభ్యర్ధిగా శ్రీదేవి నామినేషన్ వేశారు. కొన్ని రోజుల క్రితం కొయ్యల ఏమాజీ బెల్లంపల్లి టికెట్‌ను శ్రీదేవికి కాకుండా.. తనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బలంగా ఉన్న తనను కాదని డిపాజిట్ రాని అభ్యర్థికి ఎలా టికెట్ ఇస్తారని ఏమాజి, ఆయన అనుచరులు నిరనసకు దిగారు. శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ముందు ప్రకటించిన జాబితాలో లేని శ్రీదేవి పేరు ఆసక్తికరంగా నిమిషాల వ్యవధిలో తిరిగి ప్రత్యక్షమైంది. దీంతో ఏమాజికి బీజేపీ నుంచి గట్టి షాక్ తగిలినట్లయింది.
1.పెద్దపల్లి... దుగ్యాల ప్రదీప్
2.మధిర... విజయరాజు
3.శేరిలింగంపల్లి ... రవి కుమార్ యాదవ్
4.సికింద్రాబాద్ కంటోన్మెంట్.. గణేశ్ నారాయణ్
5.నాంపల్లి... రాహుల్ చంద్ర
6.చంద్రాయణ్ గుట్ట... కే.మహేందర్
7.దేవరకద్ర.... కొండా ప్రశాంత్ రెడ్డి
8.వనపర్తి... అనుగ్నా రెడ్డి
9. అలంపూర్... రాజగోపాల్
10.నర్సంపేట్... పుల్లారావు
11.మల్కాజ్ గిరి... రామచంద్ర రావు
12.సంగారెడ్డి... రాజేశ్వరరావు
13. మేడ్చల్.. ఏనుగు సుదర్శన్ రెడ్డి
14. బెల్లంపల్లి.. శ్రీదేవి