Home > జాతీయం > హిందూ ఆలయంపై రాకెట్ లాంచర్లతో దాడి.. మరో గుడి నేలమట్టం

హిందూ ఆలయంపై రాకెట్ లాంచర్లతో దాడి.. మరో గుడి నేలమట్టం

హిందూ ఆలయంపై రాకెట్ లాంచర్లతో దాడి.. మరో గుడి నేలమట్టం
X

పాకిస్తాన్‌లోని మైనారిటీ హిందువుల ప్రార్థనా స్థలాలపై దాడులు ఆగడం లేదు. ఒక రోజు వ్యవధిలోనే రెండు ఆలయాలు నాశనమయ్యాయి. బందిపోట్లు ఒక గుడిపై రాకెట్ లాంచర్లతో దాడి చేయగా, మునిసిపల్ అధికారులు మరో గుడిని నేలమట్టం చేశారు. సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరేలో ఓ దేవాలయంపై శనివారం రాత్రి దుండగులు రాకెట్ లాంచర్లతో బాంబులు పేల్చారు.. అయితే రాకెట్లలో కొన్ని పేలకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. తొమ్మదిమంది దుండగులు దాడి చేసి పరారయ్యారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గుడి పక్కనున్న హిందువుల ఇళ్లపైనా దాడి జరిగిందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గుడిని మూసే బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోపక్క కరాచీలోని 150 ఏళ్ల పురాతన మాత మారీ ఆలయాన్ని అధికారులు బుల్డోజర్‌తో పూర్తిగా నేలమట్టం చేశారు. హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదు. అది చాలా పాత ఆలయమని, కూలిపోతుంది కాబట్టే కూల్చేశామని అన్నారు. అయితే ఆ గుడి స్థలాన్ని కొందరు నకీలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కూలగొట్టించారని, దాని స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ గుడిని దక్షిణాది భారతీయులు నిర్వహిస్తున్నారు.

Updated : 17 July 2023 7:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top