Home > జాతీయం > రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్.. కుదుపులకు ఇద్దరు మృతి

రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్.. కుదుపులకు ఇద్దరు మృతి

రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్.. కుదుపులకు ఇద్దరు మృతి
X

సడెన్ బ్రేక్ ఇద్దరి ప్రాణాలు తీసింది. అత్యంత వేగంగా వెళ్తున్న ట్రైన్ను ప్రమాదం నుంచి తప్పించేందుకు లోకో పైలెట్ చేసిన ప్రయత్నంలో ఈ దారుణం జరిగింది. ఎమర్జెన్సీ బ్రేక్ కారణంగా వచ్చిన కదుపులకు రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఝార్ఖండ్ లోని కోడెర్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

శనివారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ నుంచి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీకి బయలు దేరింది. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ ట్రైన్.. గోమోహ్, కోడెర్మా రైల్వే స్టేషన్‌ల మధ్య పర్సాబాద్ సమీపానికి చేరుకుంది. అప్పుడే ఓవర్‌హెడ్‌ విద్యుత్ లైన్‌ వైరు తెగిపోవడాన్ని లోకో పైలట్లు గమనించారు. ఒక్కసారిగా కరెంట్ సప్లై ఆగిపోవడంతో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో రైలు భారీ కుదుపులకు లోనైంది. ఆ కుదుపుల కారణంగా రైలు ప్రయాణికుల్లో ఇద్దరు చనిపోయారు.

కుదుపుల కారణంగానే వాళ్లిద్దరూ చనిపోయినట్లు ధన్‌బాద్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కామర్స్ మేనేజర్ అమరేష్ కుమార్ ప్రకటించారు. ఆ సమయంలో రైలు 130 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనతో ఆగిపోయిన పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను డీజిల్‌ ఇంజిన్‌ సాయంతో గోమోహ్ స్టేషన్‌కు తరలించారు. 4 గంటల తర్వాత ఎలక్ట్రిక్‌ ఇంజిన్ సహాయంతో ట్రైన్ను అక్కడి నుంచి పంపించారు.

Updated : 12 Nov 2023 3:58 PM IST
Tags:    
Next Story
Share it
Top