Ayodhya : కళ్లకు గంతలు కట్టుకుని బైకులపై అయోధ్యకు వెళ్లిన హైదరాబాదీలు
X
హైదరాబాద్కు చెందిన ఇద్దరు మెజీషియన్లు సరికొత్తం ప్రయత్నం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని బైకులపై అయోధ్య వెళ్లారు. 8 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. దిల్సుఖ్ నగర్కు చెందిన మారుతిజోషి, సరూర్ నగర్కు చెందిన రామకృష్ణ మెజీషియన్లు. ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ప్రదర్శనలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారు వినూత్న రీతిలో అయోధ్య బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు.
ఇందులో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని బైకులపై అయెధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న ముచ్చింతల్లో చిన్నజీయర్ ఆశీస్సులతో వారు యాత్ర మొదలుపెట్టారు. అలా వారం రోజుల పాటు ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. బాల రాముడిని దర్శించుకోవడంతో తమ లక్ష్యం నెరవేరిందని మారుతి తెలిపారు. చాలా కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడపేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక ప్రాక్టీస్ చేశామని చెప్పారు.