వర్షంలో తడుస్తూ..బైక్పై స్నానం.. యువకుల వింత చేష్టలు
X
సోషల్ మీడియాలో వైరల్ కావడం కొందరు చేసే పనులు శృతిమించుతున్నాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని విచిత్ర పనులు చేస్తూ తిట్లు తింటున్నారు. గతంలో ఓ జంట ట్రాఫిక్లోనే స్కూటీపై స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాన్ని తలపించేలా ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు బైక్ మీద స్నానం చేసి హల్ చల్ చేశారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి కాన్పుర్‌లో ఇద్దరు యువకులు విచిత్రంగా ప్రవర్తించారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒంటికి సబ్బు రాసుకుని.. బైక్‌పైనే అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. ఈ ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై కాన్పుర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బహిరంగ ప్రదేశంలో ఇతరులకు ఇబ్బందులు కలిగించిన యువకుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి యువకుల కోసం గాలిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రవీనా త్యాగి స్పష్టం చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఇంట్లో బాత్ రూం లేట్లుంది..అందుకే రోడ్డుపై స్నానం చేస్తున్నారు. ఓరీ మీ యేషాలో అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.