Home > జాతీయం > Twins Baby : ఏడాది గ్యాప్‌తో పుట్టిన కవలలు.. ఎలాగంటే?

Twins Baby : ఏడాది గ్యాప్‌తో పుట్టిన కవలలు.. ఎలాగంటే?

Twins Baby : ఏడాది గ్యాప్‌తో పుట్టిన కవలలు.. ఎలాగంటే?
X

సాధారణంగా కవల పిల్లల జననంలో సమయం అనేది పావుగంట లేదా అరగంట తేడా ఉంటుంది. వారి మధ్య నెలలు, ఏళ్ళ తేడా మాత్రం ఉండదు. తాజాగా అమెరికాలో నిమిషాల వ్యవధిలో పుట్టిన ఇద్దరు కవలల మధ్య ఏడాది తేడా వచ్చింది. అదేలా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ పిల్లలు డిసెంబర్ 31 రాత్రి జన్మించారు. రాత్రి 11:59 గంటలకు మొదటి బిడ్డ జన్మించగా.. రెండవ బిడ్డ జనవరి 1 న 12:02 నిమిషాలకు జన్మించింది. దీంతో వారిద్దరికీ ఇచ్చిన బర్త్‌ సర్టిఫికెట్‌లలో తేడా సంవత్సరం వచ్చేసింది.

ఈ కవలలో ఒక్కరూ మగ కాగా మరొక్కరి ఆడ. ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సెకన్ల వ్యవధిలో పుట్టిన.. ఈ పిల్లల జననం ఏడాది వ్యవధిలో రావడంపై కవలల తల్లైన ఆలియా మోరిస్, తండ్రి పేరు మైఖేల్.

చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చాలా సార్లు కవల పిల్లలు పుడుతున్నారు. కానీ ఆ పిల్లలు ఒకే రోజు లేదా అదే సంవత్సరంలో పుడతారు. కానీ ఈ పిల్లలు సంవత్సరం తేడాతో పుట్టడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే అంతకుముందు అమెరికాలోని అలబామాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల కెల్సీ హాట్చర్ 2 రోజుల్లో 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరు పిల్లలు దాదాపు 20 గంటల తేడాతో జన్మించారు. ఈ శిశువులలో ఒకరు సాయంత్రం జన్మించగా మరొకరు మరుసటి రోజు జన్మించారు. కెల్సీ హాట్చర్ అనే ఈ మహిళకు ఒకటి కాదు, రెండు గర్భాశయాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమె రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా, స్త్రీకి ఒక గర్భాశయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మహిళలు ఒకే రోజు పిల్లలకు జన్మనిస్తారు.

Updated : 6 Jan 2024 11:12 AM IST
Tags:    
Next Story
Share it
Top