Home > జాతీయం > పులులపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు...

పులులపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు...

పులులపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు...
X

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో పెద్దపులులు వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే మొత్తం ఆరు పులులు చనిపోయాయి. తాజాగా చనిపోయిన రెండు పులుల కేసులో అటవీ శాఖ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాటినికి విషం పెట్టి చంపాడనే అనుమానాలతో విచారణ జరుపుతున్నారు.

కుందా తాలూకాలో అవలాంచ్ డ్యామ్ వద్ద నీటికుంటలో మూడేళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులుల మృతదేహాలు కనిపించాచయి. కాస్త దూరంలో ఓ ఆవు కళేబరం కనిపించింది. మూడింటి నమూనాలను పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు పురుగుమందుల ఉన్నట్టు తెలిపారు. ఆవు కళేబరానికి పురుగుల మందు పట్టించడంతో దాన్ని తిన్న పులులు మృత్యువాత పడినల్లు తేలింది. ఆవు యజమాని శేఖర్‌ను విచారించాగా తనే ఆ మందు పూసినట్లు ఒప్పుకున్నాడు. ఓ పులులు పది రోజుల కిందట ఆ ఆవును చంపి సగం తిని వెళ్లాయని, పగ తీర్చుకోవానికి ఆవు మృతదేహానికి పురుగుల మందు పట్టించానని అంగీకరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, జంతుహింస చట్టం కింద కేసు నమోదైంది. ముడుమలై టైగర్ రిజర్వ్‌లో చనిపోయిన పులుల కేసుపై విచారణ జరపుతున్నామని, స్మగ్లింగ్ సహా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెప్పారు.

Updated : 13 Sept 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top