Udhayanidhi Stalin : నేను ఎవరికీ భయపడను..నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా?
X
ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సీఎం స్టాలిన కొడుకు. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం తండ్రి కేబినెట్లో మంత్రిగా ఉన్న ఉదయనిధి తాజాగా సనాతన ధర్మం గురించి హాట్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌ను కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు, స్వామీజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదయనిధిపై మండి పడుతున్నారు. ఇటీవల అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య అనే స్వామీజీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఓ సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి తల నరికి నా దగ్గరకు తీసుకొచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆ ప్రకటన సంచలనంగా మారింది.
అయితే లేటెస్టుగా స్వామీజీ ప్రకటనపై ఉదయనిధి స్పందించారు." నా తల తెస్తే రూ.10 కోట్లు అని ప్రకటించారు. మరి నా తల కోసం ఎవరు వస్తారో నేనూ చూస్తా. ఒకప్పుడు కరుణానిధిపై ఇలాగే రూ.కోటి ప్రకటించారు. అప్పట్లో ఆయన ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు. ఇప్పుడు నేను కూడా ఎవరికీ భయపడను. అసలు స్వామీజీలుగా ఉన్న వారికి రూ.10 కోట్లు ఎలా వచ్చాయి? వారు అంత డబ్బు ఎలా సంపాదించారు? వారు నిజంగానే ఆధ్యాత్మిక గురువులా? లేక దొంగ స్వామీజీలా? స్వామీజీల ముసుగులో అక్రమంగా సంపాదించిన డబ్బు లెక్కలు చెప్పాలి.సనాతన ధర్మంలోని రూల్స్‌పై మా పార్టీ డీఎంకే చివరి వరకు పోరాటం చేస్తుంది".అని ఆయన ఘాటుగా స్పందించారు.