మెట్రో ట్రైన్‌లో మహిళల ఫైటింగ్..ఆపినా ఆగని వైనం..వీడియో వైరల్
X
ఢిల్లీ మోట్రోకి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా మెట్రో స్టేషన్లో డ్యాన్స్ చేయడం , రీల్స్ చేయడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వీడియోలు తీయడం వంటివి ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటాయి. ఎంత కట్టడి చేసినా కంటెట్ క్రియేటర్లు తమ పని చేసుకుంటూ పోతుంటారు. లేటెస్టుగా మెట్రోకి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో మాత్రం ప్రేమ, డ్యాన్స్, రీల్స్, అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించినది మాత్రం కానే కాదు. ఇద్దరు మహిళలు డిష్యూం..డిష్యూం చేసుకుంటున్న వీడియో.
బస్సులు, రైళ్లలో సీట్ కోసం గొడపడిన సంఘటనలు చాలానే చూశాం. ఆడ, మగ అన్న తేడా లేకుండా కొట్లాటలు జరుగుతుంటాయి. అది సర్వసాధారణమైన విషయమే. కానీ లేటెస్టుగా మెట్రోలో జరిగిన గొడవ మాత్రం హైలెట్‌గా నిలుస్తుంది. అయితే ఈ గొడవ జరగటానికి కారణం మాత్రం సీట్ కానేకాదట. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు నిలుచోవడానికి స్థలం ఇవ్వలేదని సిగపట్లు పట్టుకున్నారు. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ తమ నోటికి పని చెప్పారు. తోటి ప్రయాణికులు గొడవ వద్దని వారించినా అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు ఏమాత్రం ఆగలేదు. ఫైటింగ్ పక్కన పెట్టినా తమ నోటికి మాత్రం తాళాలు వేయలేదు. వారి వాగ్వాదం చాలాసేపే కొనసాగింది. ఈ క్రమంలో మహిళల ఫైటింగ్ సీన్‌ను అదే మెట్రోలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. ఆ వీడియోను కాస్త నెట్టింట్లో షేర్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఘర్కేకలేష్ అనే ట్విట్టర్ హ్యండిల్ నుంచి ఈ వీడియో షేర్ అయ్యింది.
Kalesh b/w Two Woman inside Delhi metro over not giving place to stand pic.twitter.com/8a11cfg1Hz
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 15, 2023