Home > జాతీయం > ఢిల్లీలో రుషి సునక్.. పీఎం అయ్యాక భారత్‌కు తొలిసారి..

ఢిల్లీలో రుషి సునక్.. పీఎం అయ్యాక భారత్‌కు తొలిసారి..

ఢిల్లీలో రుషి సునక్.. పీఎం అయ్యాక భారత్‌కు తొలిసారి..
X

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు కోసం ప్రపంచ దేశాల నేతలు ఒకరొకరే వచ్చేస్తున్నారు. అటు అమెరికా నుంచి ఇటు ఆసియా వరకు 19 దేశాల అగ్రనేతలు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక విమానాల్లో దిగుతున్నారు. బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి భారత సంతతి నేత రుషి సునక్ కాసేపటి కిందట ఢిల్లీ చేరుకున్నారు. భార్య అక్షతా మూర్తితో కలసి వచ్చిన ఆయనకు పాలం విమానాశ్రయంలో భారత దౌత్య అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యాక భారత్‌కు రావం ఇదే తొలిసారి . జీ20 సదస్సులో బ్రిటన్‌కు అనుకూలంగా ఉండే ఒప్పందాలపై మాత్రమే తనను సంతకం చేస్తానని సునక్ మంగళవారం చెప్పారు.





అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాయంత్రం ఏడు గంటలకు హస్తిన చేరుకోనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సదస్సులో వాతావరణ మార్పుల నిరోధకం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై ఎప్పట్లాగే చర్చలు జరిపి తీర్మానాలు చేస్తారు. మోదీ సదస్సు సందర్భంగా కూటమి దేశాల నేలతో ద్వైపాక్షిక చర్చలు జరపుతారు. సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జగకుండా లక్షమందికిపైగా పోలీసులను మోహరించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విద్యా సంస్థలు, దుకాణాలకు, ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. రైళ్లు, విమానాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు.





Updated : 8 Sept 2023 3:02 PM IST
Tags:    
Next Story
Share it
Top