Home > జాతీయం > అందరూ చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్‌

అందరూ చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్‌

అందరూ చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్‌
X

బిహార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఖగారియా జిల్లాలో గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్‌ గంగా పేరుతో బీహార్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రిడ్స్‌ను నిర్మిస్తోంది. 2015లో నీతీశ్‌ కుమార్‌ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖగారియా - అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

వంతెన నిర్మాణం కోసం రూ.1,717 కోట్లు కేటాయించి 2020 నాటికి పూర్తి చేయలాని భావించారు. అయితే ఇప్పటికే ఆ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. ఏప్రిల్ నెలలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వంతెన..మరోసారి ఇప్పుడు ప్రమాదానికి గురైంది. గతేడాది డిసెంబర్‌లో కూడా బిహార్‌లోని బెగుసరాయ్‌ ప్రాంతంలో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయిన సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై ప్రతిపక్షాలు నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.








Updated : 4 Jun 2023 9:38 PM IST
Tags:    
Next Story
Share it
Top