Home > జాతీయం > విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 17 మంది దుర్మరణం

విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 17 మంది దుర్మరణం

విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 17 మంది దుర్మరణం
X

మిజోరంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో 17 మంది మృతి చెందారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌ సమీపంలోని సైరంగ్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో 35 నుంచి 40 మంది వంతెనపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శిథిలాల మరికొంత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.





విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మిజోరంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది చనిపోవడంతో ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు.




Updated : 23 Aug 2023 1:11 PM IST
Tags:    
Next Story
Share it
Top