ఆర్టీసీ బస్‌లో హిజ్రాలకు ఫ్రీ..సర్కార్ ఉత్తర్వులు జారీ
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇచ్చిన హామీని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యనే నెరవేర్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, థర్డ్ జెండర్ అయిన హిజ్రాలుకు కూడా వర్తిస్తుందని తాజాగా సర్కార్ పేర్కొంది. ఈ నెల 11 నుంచి వారు కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. తాజాగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
శక్తి పథకంలో ట్రాన్స్‌జెండర్లను కూడా భాగం చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇకపై హిజ్రాలు కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తాజాగా జీవోను కూడా జారీ చేసింది. ఇటీవల ఓ కండక్టర్‌తో హిజ్రా వాదించిన సంఘటన రాయచూర్‌లో చోటు చేసుకుంది. బుధవారం రాయచూరు నుంచి యాదగిరి వెళ్లే బస్సులో లక్ష్మి అనే హిజ్రా కూర్చుకుంది. బస్సు బయల్దేరగానే కండక్టర్ లక్ష్మి దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోవాలంది. అయితే లక్ష్మి తన ఆధార్ కార్డును తీసి కండక్టరుకు ఇచ్చి ఫ్రీ టికెట్ వర్తిస్తుందని తెలిపింది. అయితే కండక్టర్ తనకు ఆధార్ చెల్లదని, ఉచిత టికెట్ వర్తించదని టికెట్‌కు డబ్బులు ఇవ్వాల్సిందేనని వాధించాడు. నేను కూడా మహిళల కోటాలోకే వస్తానని ముఖ్యమంత్రి తెలిపారని రిప్లై ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. హిజ్రా లక్ష్మి ప్యాంట్ షర్ట్‌లో కనిపించడంతో అసలు వివాదం స్టార్ట్ అయ్యింది. పురుషుడు అనుకుని కండక్టర్ టికెట్ కోసం వాదనకు దిగాడు.