Home > జాతీయం > కేంద్రం రూ.15 వేల ఆర్థిక సాయం.. అర్హులెవరంటే

కేంద్రం రూ.15 వేల ఆర్థిక సాయం.. అర్హులెవరంటే

కేంద్రం రూ.15 వేల ఆర్థిక సాయం.. అర్హులెవరంటే
X

77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండా ఎగరేసిన ప్రధాని మోదీ.. పలు ప్రథకాలు ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్ట్ 15) ప్రకటించిన పథకాలకు.. బుధవారం (ఆగస్ట్ 16) జరిగిన కేంద్ర కేబీనెట్ మీటింగ్ లో ఆమోదం లభించింది. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తు వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, కుమ్మరి, ఇతర కులవృత్తుల వారికి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనుంది.

దీనికి గరిష్ఠంగా 5శాతం వడ్డీతో ఈ రుణాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా చేతివృత్తుల వాళ్లకు రోజుకు రూ.500 ఉపకార వేతనంతో ట్రైనింగ్ ఇచ్చి.. తర్వాత పరికరాల కొనుగోలుకు రూ.15వేల ఆర్థిక సాయం చేయనున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వాళ్లకు రాయితీపై రుణాలు ఇచ్చేందుకు రూ.13వేల కోట్లు ఖర్చు చేయనుంది. అంతేకాకుండా పీఎం ఈ-బస్ సేవా పథకానికి కూడా ఆమోదం తెలిపింది. దేశంలోని 100 పట్టణాల్లో 10వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని.. దానికోసం రూ.57,600 కోట్లు ఖర్చు చేయనుంది.




Updated : 16 Aug 2023 7:06 PM IST
Tags:    
Next Story
Share it
Top