Home > జాతీయం > Gas Cylinder: తెలుగు రాష్ట్రాల సమస్య తీర్చుతూ.. కేంద్ర కేబీనెట్ ఆమోదం

Gas Cylinder: తెలుగు రాష్ట్రాల సమస్య తీర్చుతూ.. కేంద్ర కేబీనెట్ ఆమోదం

Gas Cylinder: తెలుగు రాష్ట్రాల సమస్య తీర్చుతూ.. కేంద్ర కేబీనెట్ ఆమోదం
X

గ్యాస్ సిలిండర్ రాయితీని పెంచుతూ.. కేంద్ర కేబీనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే రాయితీని రూ.300లకు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పేదలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పై రూ.200 రాయితీని అందిస్తుండగా.. దాన్ని రూ.300లకు పెంచింది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.903 ఉంది. ఉజ్వల పథకం లబ్దిదారులకు రూ.703కు అందిస్తున్నారు. కేంద్ర కేబీనెట్ తాజా నిర్ణయంతో ఉజ్వల పథకం లబ్దిదారులకు రూ.603కు గ్యాస్ సిలిండర్ అందనుంది.

అంతేకాకుండా కేబీనెట్ తెలంగాణకు వరాలు జల్లు కురింపించింది. నిజామాబాద్ లో పసుపు బోర్డుతో పాటు ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం లభించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం- 2009లో సవరణకు ఆమోదం లభించింది. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తూ వచ్చిన తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్యున్న కృష్ణా జలాల వివాధం తీరిపోయి.. తెలంగాణకు రావాల్సిన వాటా వస్తుంది. కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుంది.




Updated : 4 Oct 2023 11:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top