Home > జాతీయం > union govt calls all party meeting : ఈ నెల 17న అఖిలపక్ష భేటీ.. ‘ప్రత్యేక’ గుట్టు విప్పని కేంద్రం...

union govt calls all party meeting : ఈ నెల 17న అఖిలపక్ష భేటీ.. ‘ప్రత్యేక’ గుట్టు విప్పని కేంద్రం...

union govt calls all party meeting : ఈ నెల 17న అఖిలపక్ష భేటీ.. ‘ప్రత్యేక’ గుట్టు విప్పని కేంద్రం...
X

ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎజెండా ఏంటన్నది కేంద్రం ఇప్పటివరకు చెప్పలేదు. సమావేశాల ఎజెండాపై అటు ప్రతిపక్షాలు సైతం కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం అఖిలపక్ష భేటీకి సిద్ధమైంది. ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి రావాలని ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానాలు పంపినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

‘‘ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 17న సాయంత్రం 4:30 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించిన ఆహ్వానాలను సంబంధిత నేతలకు ఈ మెయిల్ ద్వారా పంపాం. లేఖలు కూడా వారికి అందుతాయి’’ అని జోషి ట్వీట్ చేశారు. అయితే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలతోపాటు అఖిలపక్ష సమావేశం అజెండా ఏమిటన్నది ఆయన చెప్పలేదు.

ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో కేంద్రం కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు, ఇండియా పేరును ‘భారత్‌’గా మార్చడం, యూనిఫాం సివిల్ కోడ్ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుందని వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Updated : 13 Sept 2023 4:21 PM IST
Tags:    
Next Story
Share it
Top