"రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది".. కేంద్ర మంత్రి
X
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్.. తమను లైంగికంగా వేధించారని ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన కొన్ని రోజులకే అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
కాగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. అతడిని అరెస్టు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. "రెజ్లర్ల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని మంగళవారం అర్థరాత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. చర్చల కోసం తాను మరోసారి రెజ్లర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.
జూన్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సత్యవత్ కేదాన్.. భేటీ అయ్యారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నారు. అర్ధరాత్రి వరకు ఈ సమావేశం జరిగింది. ఈ సమస్యపై తాను దృష్టిసారిస్తానని అమిత్ షా.. రెజ్లర్లతో హామీ ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన రెజ్లర్లతో అన్నారు.
The government is willing to have a discussion with the wrestlers on their issues.
— Anurag Thakur (@ianuragthakur) June 6, 2023
I have once again invited the wrestlers for the same.