Home > జాతీయం > పెళ్లికాని వారికి రూ. 2,750 పెన్షన్.. షరతులు చెప్పేశారు..

పెళ్లికాని వారికి రూ. 2,750 పెన్షన్.. షరతులు చెప్పేశారు..

పెళ్లికాని వారికి రూ. 2,750 పెన్షన్.. షరతులు చెప్పేశారు..
X

పెళ్లికాని వారికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపిన హరియాణా ప్రభుత్వం గురువారం లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, విధివిధానాలను విడుదల చేసింది. అవివాహితుల ప్రత్యేక అవసరాను తీర్చడమే ఈ పథకం ఉద్దేశమని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. తమ ప్రభుత్వం నిధులకు వెనకాడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

ఈ అర్హతలు ఉండాలి..

పెళ్లి కాని స్త్రీ పురుషులందరీకీ నిబంధనల మేరకు పెన్షన్ ఇస్తారు. వయసు 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం రూ. 1.8 లక్షలు దాటితే ఇవ్వరు. అయితే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉండి జీవిత భాగస్వామిని కోల్పోయి వారికి వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉన్నా పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ పథకంతో రాష్ట్ర ఖజానాలపై రూ. 240 కోట్ల భారం పడుతుంది. దాదాపు 70 వేలమందికి అబ్ధి కలగనుంది. అబ్ధిదారులకు 60 ఏళ్లు దాటాకా ఈ పెన్షన్ నుంచి తప్పించి వృద్ధాప్య పెన్షన్ జాబితాలో చేరుస్తారు.

‘పెళ్లి కాని పెన్షన్’ ఇంకా చేతిలో పడకున్నా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం, అనారోగ్యం వంటి అనేక కారణాల వల్ల పెళ్లిళ్లు చేసుకోలేకపోయామని, కాస్త కాలూ చేయీ ఆడతున్నప్పుడే కడుపుకింత తినడడానికి, అవసరాలకు పెన్షన్ ఇవ్వడం బావుందని అంటున్నారు. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు కూడా తర్వలో ఉండడంతో పార్టీలు ఈ పెన్షన్‌పై కన్నేశాయి. పెద్ద ఖర్చు లేకండా ఆకర్షణీయ పథకంలో ఓట్లు దండుకోవచ్చని ఆలోచిస్తున్నాయి.

Updated : 6 July 2023 10:21 PM IST
Tags:    
Next Story
Share it
Top