Home > జాతీయం > రూ.70 వేలతో ఫోన్.. సీమా విచారణలో సంచలన విషయాలు

రూ.70 వేలతో ఫోన్.. సీమా విచారణలో సంచలన విషయాలు

రూ.70 వేలతో ఫోన్.. సీమా విచారణలో సంచలన విషయాలు
X

పబ్జీ ద్వారా పరిచయమైన సచిన్ మీనా అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో నేపాల్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన సీమా హైదర్ వ్యవహారం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఏటీఎస్ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

ఇప్పటికే సీమా సోదరుడు, ఆమె మావయ్య పాకిస్తాన్ సైన్యంలో పని ఏటీఎస్ అధికారులు తేల్చగా తాజాగా మరికొన్ని విస్తుపోయే నిజాలను రాబట్టారు. సీమా హైదర్ ఇండియాకి వచ్చే ముందు మిలటరీ అధికారులకు ఫ్రెండ్ రిక్వస్ట్‎లు పంపిందని.. ఆమె ఇక్కడకు రావడానికి ఓ వ్యక్తి సాయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో సీమా హైదర్ పాకిస్తాన్ ఏజెంట్ అనే అనుమానాలకు మరింత బలం చేకూరింది.

విచారణలో భాగంగా సంధించిన ప్రశ్నలకు సీమా హైదర్ చాలా తెలివిగా సమాధానాలు చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. తడబడకుండా హిందీ మాట్లాడడం, ప్రతీ ప్రశ్నకు ఆలోచించి సమాధనం చెప్పడం నిఘా వర్గాలకు మరింత అనుమానాలు కలుగజేస్తున్నాయి. ఇండియాలో ఎవరో ఒక వ్యక్తి ఆమెను గైడ్ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సచిన్ కాకుండానే ఇండియాలో సీమాకి ఇతర కాంటాక్ట్‎లు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

రూ.70వేలతో ఫోన్..

అతి పేదరానికి చెందిన మహిళగా చెప్పుకుంటున్న సీమా హైదర్ రూ.70 వేలు విలువ చేసే ఫోన్ కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అది కూడా ఫోన్ కొన్న రోజే పాస్ పోర్ట్ రావడం తో అధికారులుకు అనుమానాలు కలగుతున్నాయయి. మే 8న మొబైల్ ఫోన్ కొన్నట్లు చెప్పిన సీమా.. అదే రోజున ఆమెకు పాస్ పోర్ట్ జారీ అయ్యింది. కేవలం రెండు రోజుల్లో అంటే మే 10న పాకిస్తాన్‌ను వదిలి వచ్చేసింది.

ఇండియాకు వచ్చే ముందు ఆమె పలువరు ఆర్మీ అధికారులకు ఫ్రెండ్స్ రిక్వస్ట్‌లను పంపినట్లు విచారణలో తేలింది. వీటిపై అధికారులు దృష్టించారు. ఆమె ఎందుకు ఆర్మీ అధికారులకు ఫ్రెండ్స్ రిక్వస్ట్‌లు పంపింది.. ? రూ.70 వేలు విలువ చేసే ఫోన్ కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడిది..ఇండియా రావడానికి సాయం చేసే వ్యక్తి ఎవరు అన్నా అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


Updated : 19 July 2023 12:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top