కలర్ తక్కువగా ఉన్నాడని నో చెప్పిన పెళ్లి కూతురు.. వరుడు షాక్
X
ఆ వేదికపై అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగుతుంది. నచ్చిన ఆమ్మాయి తన సొంతమవుతుందనే ఆనందంలో ఆ పెళ్లి కొడుకు.. ఆమె వేసే వరమాల కోసం ఎదురుచూస్తున్నాడు. అనకుంటుండగానే.. ఆ వధువు పూల దండ తీసుకుని వివాహ వేదికపైకి వచ్చింది. దండ వేసే ముందు అతనిని పరిశీలనగా చూసింది. అతడు కూడా కాబోయే భార్య కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలోనే... అతనికి పూల దండ వేసేందుకు నిరాకరించింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక ఆ పెళ్లి కొడుకు ఆందోళకు లోనయ్యాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌పురాలో ఉంటున్న యువకునికి చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. గత నెల 29న వరుడు తమ తరపు పెద్దలతో పాటు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వధువు తరపువారంతా పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. తరువాత వరమాల కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. వరమాల వేసేందుకు వేదికపైకి చేరుకున్న వధువు.. వరుడి ముఖాన్ని పరిశీలనగా చూసి పూల దండ వేసేందుకు నిరాకరించింది. అతడు రంగు తక్కువగా ఉన్నాడని అతనిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీనికితోడు ఆ యువకుడు వయసు మీదపడినవానిలా కనిపిస్తున్నాడని కూడా వధువు ఆరోపించింది. అందుకే తాను ఈ వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పేసింది. దీంతో పెళ్లిపెద్దలు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆమె వారి మాట వినలేదు. ఇక చేసేదేం లేక వరుడు తరపువారు వెనుకకు తిరిగి వెళ్లిపోయారు.