Home > జాతీయం > నది మధ్యలో చిక్కుకు పోయిన బస్సు...ప్రయాణికుల అరుపులు..వీడియో వైరల్

నది మధ్యలో చిక్కుకు పోయిన బస్సు...ప్రయాణికుల అరుపులు..వీడియో వైరల్

నది మధ్యలో చిక్కుకు పోయిన బస్సు...ప్రయాణికుల అరుపులు..వీడియో వైరల్
X

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్లు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వరదల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇప్పటికే వాహనాలు వరదల్లో చిక్కుకుని చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కొత్వాలీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చింది. అయితే ఓ బస్సు డ్రైవర్ వరదనీటి ప్రవాహంలో బస్సు పోనిచ్చి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడు. కాస్త ముందుకెళ్లిన బస్సు తర్వాత ముందుకెళ్లలేకపోయింది. ఆందోళనకు గురైన ప్రయాణికులు తమను కాపాడాలంటూ కేకలు వేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయసహకారాలు అందించారు. జేసీబీ మిషన్ల సాయంతో 40 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత బస్సును కూడా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.




Updated : 22 July 2023 3:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top