అక్కడ బుల్డోజర్తో తొక్కిపడేశాం.. ఇక్కడ కూడా అదే జరుగుద్ది: యోగి
X
తాను సీఎం కాకముందు యూపీలో మాఫియా, అక్రమ దందాలదే రాజ్యంగా ఉండేదని.. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వచ్చాక వాటినిన బుల్డోజర్తో తొక్కిపడేశామని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆదిత్యనాథ్.. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకునే సమయం వచ్చిందన్నారు. పేపర్ లీకేజీల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోతోందని.. యూపీలో ఆరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.
కాంగ్రెస్ పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు ఉండేవని మోదీ అధికారంలోకి వచ్చాక అవేవీ లేవని చెప్పారు. భారత్‌పై దాడికి, చొరబాట్లకు ఎవరూ సాహసించరని, ఒకవేళ చేస్తే మెరుపుదాడులు చేసి బదులిస్తామని వారికి తెలునని వివరించారు. సరిహద్దుల రక్షణను బలోపేతం చేయడంతో పాటు దేశంలో మౌలికల వసతుల కల్పనకు ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఉమ్మడి స్నేహితుడు ఎంఐఎం అని.. ముగ్గురు ఒకే తానులోని ముక్కలుగా అభివర్ణించారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా ముగ్గురికీ వేసినట్లేనన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు.