Home > జాతీయం > నుజ్జు నుజ్జైన సీఎం యోగి కాన్వాయ్.. కుక్కను తప్పించబోయి..

నుజ్జు నుజ్జైన సీఎం యోగి కాన్వాయ్.. కుక్కను తప్పించబోయి..

నుజ్జు నుజ్జైన సీఎం యోగి కాన్వాయ్.. కుక్కను తప్పించబోయి..
X

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లక్నోలో వెళ్తుండగా ఓ కుక్క అకస్మాత్తుగా కారు ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యోగి కాన్వాయ్ లోని యాంటీ డెమో వాహనం ఈ ప్రమాదానికి గురైంది. కారుకు అడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడ్డవారందరినీ చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

up cm yogi adityanath Convoy overtuns in lucknow

Updated : 25 Feb 2024 8:46 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top