బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమజంట.. హద్దులు దాటారు
X
సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసమో.. లేదంటే థ్రిల్ కోసమో.. తెలియదు కానీ.. నడిరోడ్లపై ప్రేమజంటలు రెచ్చిపోతున్నారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. రన్నింగ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేయడం మాత్రం మానడం లేదు. నడి రోడ్డుపై రన్నింగ్ బైక్ పై అసభ్యకర చేష్టలతో, అశ్లీల భంగిమలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కౌగిలింతలు, లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి.. అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని అంతా చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తించడం ఫ్యాషన్ గా మారిపోయింది.
తాజాగా యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాలు రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట కౌగిలింతల్లో మునిగితేలింది. బైక్ నడుపుతున్న యువకుడు తన ప్రియురాలిని తనకు ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. అతడు బైక్ నడుపుతుంటే .. ఎదురుగా కూర్చున్న ఆమె గట్టిగా కౌగిలించకుని ఉంది. ఆ సమయంలో ఆ రోడ్డుపై వాహనాల రద్దీ ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా ఘోర ప్రమాదం జరగడం ఖాయం. సింబావోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
#Hapur वाह क्या सीन है, वीडियो NH 9 की थाना सिंभावली की है। बाइक पर आगे बैठा स्पाइडर वीमेन लग रही है, बाकी ट्रैफिक नियमो का क्या? वो तो चलते रहेंगे। @hapurpolice @uptrafficpolice pic.twitter.com/HojqWW2RNE
— Lokesh Rai (@lokeshRlive) October 10, 2023
బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ కూడా ధరించలేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, నేషనల్ హైవేపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తుండగా.. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు ఈ జంట రొమాన్స్ ను వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ జంట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నడిరోడ్డుపై ప్రమాదకరంగా బైక్ నడపడమే కాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ తోటి వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వారికి బుద్ధి చెప్పాల్సిందేనని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.