Home > జాతీయం > నోట్ల కట్టలతో సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ ఎస్సై

నోట్ల కట్టలతో సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ ఎస్సై

నోట్ల కట్టలతో సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ ఎస్సై
X

ఓ ఎస్సై తీసుకున్న సెల్ఫీ ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. భార్య పిల్లలతో ఆయన తీసుకున్న సెల్ఫీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వారు సెల్ఫీ దిగింది నోట్ల కట్టలతో.. చుట్టూ నోట్ల కట్టలు పెట్టుకుని వాటితో వారంతా ఫొటో దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.

ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతడు తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

డబ్బ ఎక్కడిది.. ఎవరిచ్చారనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు.

ఫొటోలో కనిపిస్తున్న డబ్బు 14 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ డబ్బుపై సహాని స్పందించారు. ఆ డబ్బు తన వారసత్వ ఆస్తిని అమ్మితే ఆ డబ్బు వచ్చిందని తెలిపారు. అది ఇప్పటిది కాదని.. నవబర్ 14, 2021న తీసుకున్న సెల్ఫీ అని వివరించాడు. ఈ క్రమంలో ఎస్సై సహానిని పోలీసు లైన్స్‌కు బదిలీ చేశారు.




Updated : 30 Jun 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top