Home > జాతీయం > బ్యాంక్ లాకర్‌లొ రూ.18 లక్షలు.. తెరిచి చూస్తే..

బ్యాంక్ లాకర్‌లొ రూ.18 లక్షలు.. తెరిచి చూస్తే..

బ్యాంక్ లాకర్‌లొ రూ.18 లక్షలు.. తెరిచి చూస్తే..
X

కూతురి పెళ్లి కోసం బ్యాంక్​ లాకర్​లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18లక్షలను చెదలు తినేశాయి. దీంతో మహిళ ఒక్కసారిగా షాక్​కు గురైంది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.​ లాకర్​లో దాచిపెట్టిన రూ.18లక్షలు.. నల్లని మట్టిగా మారిపోవడం ఒక్కసారిగా షాకైంది. వెంటనే బ్యాంక్ మేనేజర్​కు ఫిర్యాదు చేసింది.

యూపీలోని మొరాదాబాద్.. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. ట్యూషన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్​ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. కొన్నినెలల క్రితం ఇదే బ్యాంక్​లో ఆమె లాకర్​ తీసుకుంది. కూతురి పెళ్లి కోసం ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకుంటూ.. . మొత్తం రూ.18లక్షలతో పాటు విలువైన నగలను లాకర్​లో ఉంచింది.

అయితే సెప్టెంబర్​ 25వతేదీన​ కేవైసీ, లాకర్​ అగ్రిమెంట్​ రెన్యువల్​ కోసం అల్కా.. బ్యాంక్​కు వెళ్లింది. ఆ సమయంలో లాకర్​ను తెరిచిన అల్కా.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. డబ్బు నోట్లన్నింటినీ చెదలు తినేసి ఉండడం గమనించింది. వెంటనే బ్యాంక్​ మేనేజర్​కు విషయాన్ని చేరవేసింది. ఆయన వచ్చి చూడగా.. చెద పురుగుల తినేయడంతో నోట్లన్ని నల్లని మట్టి, ముక్కలుగా పడి ఉన్నాయి. అయితే నగలు భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్​ తెలిపారు. కేసును విచారిస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్​ లాకర్​లో డబ్బులు పెట్టకూడదని విషయం తనకు తెలియదని అల్కా చెప్పింది.

Updated : 27 Sept 2023 2:11 PM IST
Tags:    
Next Story
Share it
Top