Home > జాతీయం > యూపీఏ పేరు మార్పు.. బెంగళూరులో 24 విపక్షాల భేటీ..

యూపీఏ పేరు మార్పు.. బెంగళూరులో 24 విపక్షాల భేటీ..

యూపీఏ పేరు మార్పు.. బెంగళూరులో 24 విపక్షాల భేటీ..
X

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఏకతాటిపైకి వస్తున్న విపక్షాలు సోమవారం బెంగళూరులో కీలక భేటీ నిర్వహిస్తున్నాయి. గత నెల పట్నాలో 15 విపక్షాలు సమావేశమై మోదీని అడ్డుకోవడానికి వ్యూహరచన చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ భేటీకి కొనసాగింపే బెంగళూరు సమావేశం. విపక్షాల మంతనాల్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. యూపీఏ(ఐక్య ప్రగతికూటమి.. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) పేరును మార్చబోతున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయం వెల్లడించారు.

‘‘పేరు మార్చాలని నిర్ణయించాం. చర్చలు జరుపుతాయి. ఏ పేరు అన్నది అందర్నీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ ఒక్కటే కాదు, చాలా పార్టీలకు ఉన్నాయి కదా’’ అని ఆయన అన్నారు. సమావేశానికి విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు. 2024 ఎన్నికల అజెండాతోపాటు ఈ నెల 20 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని చిక్కునపడేసే వ్యూహాలను కూడా రూపొందించనున్నారు. స్టాలిన్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ సహా ఏడుగురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

పాల్గొనే పార్టీలు ఇవే..

కాంగ్రెస్‌, తృణమూల్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, ఎన్‌సీపీ(శరద్ పవార్ వర్గం), సీపీఎం, సీపీఐ, డీఎంకే, సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్‌ వర్గం), జేఎంఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వీసీకే, టీఎంఎసీ(తమిళనాడు) ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎండీఎంకే, కేడీఎంకే, ఆర్‌ఎ్‌సపీ, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌

నడ్డా వెటకారం..

యూపీఏ పేరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘యూపీఏ అంటే ఉప్తిదాన్(అణచివేత), పక్షపాత్, అత్యాచార్ అని అర్థం. అది అమ్మ, కొడుకు, కూతురు పార్టీ. యూపీఏ పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలు. అవినీతిలో ముగినిగిన పార్టీలు రక్షణ కోసమే జట్టుకట్టాయి’’ అని రాజస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.

Updated : 17 July 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top