Home > జాతీయం > Aadhaar Card: ఆధార్ అప్‌డేట్ చేశారా.. ఇంకా 4 రోజులే గడువు

Aadhaar Card: ఆధార్ అప్‌డేట్ చేశారా.. ఇంకా 4 రోజులే గడువు

Aadhaar Card: ఆధార్ అప్‌డేట్ చేశారా.. ఇంకా 4 రోజులే గడువు
X

ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి అలర్ట్. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు ఉచితంగా చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా పౌరులకు ఈ అవకాశం కల్పించింది యూఐడీఏఐ. . ఇప్పుడు myAadhaar పోర్టల్‌లో ఉచితంగా ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని గురించి UIDAI ఇంతకుముందు ఒక ట్వీట్ చేసింది.

పౌరులు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్స్‌ను ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in సైట్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేసి, ఆధార్‌ను రీవ్యాలిడేఏట్ చేయవచ్చని సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఇందుకు గడువు గతంలోనే ముగిసినా, తర్వాత ఉచిత సేవలు పొందే గడువును చాలాసార్లు పొడిగించారు.

పదేళ్ల క్రితం ఆధార్‌ తీసుకున్నవారు కొన్ని డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేసి వివరాలను అప్‌డేట్ చేయాలని UIDAI గతంలో స్పష్టం చేసింది. ప్రజలు డెమోగ్రఫిక్ వివరాలను అప్‌డేట్ చేస్తే సేవలు త్వరగా, సులభంగా అందించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్‌లో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఆధార్ సెంటర్స్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కొంత మొత్తం ఫీజు చెల్లించాలి. ఆధార్ వివరాల్ని ఉచితంగా అప్‌డేట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తొలుత మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.

పోర్టల్‌లో డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

మీ వివరాలు ధ్రువీకరించి.. మార్చాల్సిన సమాచారం సెలక్ట్ చేయండి.

అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ హైపర్‌లింక్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

డ్రాప్‌డౌన్ మెమో నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ ఎంచుకోవాలి.

స్కాన్ చేసిన కాపీల్ని నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి.. వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇక పదేళ్ల కిందట ఆధార్ కార్డు తీసుకున్నవారు కూడా ఇందులో ఏం అప్‌డేట్ చేయకుంటే చేయాలని సూచించింది యూఐడీఏఐ. కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి.. వివరాలు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రజలు డెమోగ్రాఫిక్ వివరాలు అప్‌డేట్ చేస్తే సేవలు త్వరగా.. సులభంగా అందించే అవకాశం ఉంటుందని పేర్కొంది.




Updated : 10 Dec 2023 9:34 AM IST
Tags:    
Next Story
Share it
Top