Home > జాతీయం > వివాదంలో నటుడు ఉపేంద్ర.. భగ్గుమంటున్న దళితులు

వివాదంలో నటుడు ఉపేంద్ర.. భగ్గుమంటున్న దళితులు

వివాదంలో నటుడు ఉపేంద్ర.. భగ్గుమంటున్న దళితులు
X

వింతవింత పాత్రలు, విలక్షణ నటనతో వింత ఇమేజ్ తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన సినిమాలు బోల్తా కొడుతుండడంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఓ పార్టీ పెట్టి చట్టసభలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. అయినా పార్టీ పేరుతో హల్‌చల్ చేస్తుంటాడు. రీల్ లైఫ్‌కు రియల్ లైఫ్‌కు తేడా తెలియకుండా రెచ్చిపోతుంటాడు. తాజాగా అలాగే రెచ్చిపోయి చిక్కుల్లో పడ్డాడు. దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో తీవ్ర దుమారం రేగుతోంది. దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. చెన్నమన్న కెరే స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో ఉపేంద్ర దిగిరాక తప్పలేదు..

ఏమన్నాడంటే...

తన పార్టీ ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’పై వస్తున్న విమర్శలకు ఉపేంద్ర సోషల్ మీడియాలో లైవ్‌లో సమాధానాలు చెబుతూ మాట తూలాడు. ‘‘ఒక మంచిపని చేస్తుంటే విమర్శించేవారు చాలా మందే ఉంటారు. ఒక ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉన్నట్లు వీరు కూడా ఉంటారు. వీరి విమర్శలు పట్టించుకోకూడదు. వీరి కామెంట్లను చదవకూడదు. మంచి హృదయాలతోనే మార్పు వస్తుంది. ప్రజలను ప్రేమించడమే అసలైన దేశభక్తి. అలాంటి వారే నా వెంట రావాలి. మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఏ పనీ లేనివాళ్లే వాగుతుంటారు’’ అని ఉపేంద్ర అన్నాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉపేంద్ర క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళనకారులు ఉపేంద్ర పోస్టర్లను కాల్చేశారు. దీంతో యాంగ్రీ యాక్టర్ దిగొచ్చి సారీ చెప్పాడు. తను తప్పుగా మాట్లాడానని, హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. ‘‘నా మాటలు చాలామంది మనసులను గాయపరిచాయి. అందుకే ఆ వీడియోను డిలీట్ చేశాను’’ అని అన్నాడు.

Updated : 14 Aug 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top