Home > జాతీయం > జాతీయ జెండాతో సెల్ఫీ.. అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్

జాతీయ జెండాతో సెల్ఫీ.. అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్

జాతీయ జెండాతో సెల్ఫీ.. అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్
X

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమైంది. రేపు వాడవాడల త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ పదోసారి జెండా ఆవిష్కరించనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం హరఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను పెట్టాలని పిలుపునిచ్చింది. దీనికి మద్ధతుగా సోషల్ మీడియాలో డీపీలను మార్చాలని మోదీ సూచించారు.

ఇక జాతీయ జెండాతో సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే కేంద్రం సర్టిఫికెట్ ఇవ్వనుంది. దీన్ని కోసం harghartiranga.com అనే పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు జెండాతో దిగిన సెల్ఫీని ఇందులో అప్లోడ్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికెట్ అందజేయనుంది. ఇప్పటికే ఎంతో మంది జెండాతో దిగిన సెల్పీని అప్లోడ్ చేశారు.

ఎలా చేయాలంటే..

ముందుగా harghartiranga.com వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని కన్పిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అందులో పేరు నమోదు చేసుకుని ఫొటోను అప్లోడ్ చేయాలి. ఇలా సబ్ మిట్ చేసిన తర్వాత మీకో సర్టిఫికెట్ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్టిఫికెట్ కావాలంటే ఆగస్టు 16 ఉదయం 8 గంటల వరకు ఆగాల్సిందే.





Updated : 14 Aug 2023 9:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top