Home > జాతీయం > దేశవ్యాప్తంగా అమెరికా వీసా సేవల నిలిపివేత.. తాత్కాలికమే

దేశవ్యాప్తంగా అమెరికా వీసా సేవల నిలిపివేత.. తాత్కాలికమే

వీసా సేవలు బంద్.. కారణమేంటంటే..

దేశవ్యాప్తంగా అమెరికా వీసా సేవల నిలిపివేత.. తాత్కాలికమే
X


దేశవ్యాప్తంగా వీసా సేవలను ఈ నెల 28వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలిపింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసుకునే క్రమంలోనే వీసా సేవల నిలిపివేతకు కారణమని ట్విట్టర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న ఈ సేవల కోసం వినియోగిస్తున్న వ్యవస్థ (స్లాట్ ఫామ్)ను మరింత అధునాతనంగా మార్పు (అప్ డేట్) చేసేందుకు బుధవారం నుంచి మూడ్రోజుల పాటు అన్ని రకాల సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 28వ తేదీ వరకు (శుక్రవారం) వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు చెప్పింది, వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్స్ తదితర అన్ని సేవలు శనివారం నుంచి యథావిధిగా అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. ఇకపై అమెరికా కాన్సులేట్ కార్యాలయాలకు చెందిన కస్టమర్‌ సర్వీస్‌ ఈ-మెయిల్‌ ఐడీ కూడా మారుతుందని పేర్కొంది. శనివారం నుంచి [email protected] కాన్సుల్ కార్యాలయాలను సంప్రదించ వచ్చని తెలిపింది.

మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.ustraveldocs.com/వెబ్‌సైట్‌ను చూడవచ్చు అని వివరించింది. శనివారంలోగా అత్యవసరంగా వీసాలు, ఇతర సేవలు కావాల్సిన వారు Hydcons [email protected] లేదా [email protected] మెయిల్స్‌లో సంప్రదించవచ్చని అమెరికన్‌ కాన్సులేట్‌ ట్వీట్‌లో పేర్కొంది. రెండు రోజుల పాటు నిలిచే ఈ సేవలను తిరిగి శనివారం నుంచి యధావిధిగా పునరుద్దించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.



Updated : 27 July 2023 8:39 AM IST
Tags:    
Next Story
Share it
Top