ఢిల్లీ చేరిన బైడెన్.. మోదీ ఇంట్లో ముచ్చట్లు
X
అమెరికా అధినేత జో బైడెన్ జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మందీమార్బలంలో ఆయన సాయంత్రం ఏడుగంటలకు ల్యాండ్ అయ్యారు. భారత పౌరవిమానయాన మంత్రి వీకే సింగ్, విదేశాంగ ప్రతినిధులు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.
బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలంపై వీరు మంతనాలు జరుపుతారని, రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదురుతాయని దౌత్యవేత్తలు చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, హైటెక్నాలజీ, రక్షణ, వీసాల సరళీకరణ వంటి అంశాలపై సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. బైడెన్‌కు మోదీ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. బైడెన్ భారత దేశానికి రావడం ఇదే తొలిసారి. శుక్ర, శనివారాల్లో జరిగే సదస్సుకు వస్తున్న జర్మనీ, ఇటలీ, కెనడా తదితర దేశాల నేతలనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
#WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit
— ANI (@ANI) September 8, 2023
He will hold a bilateral meeting with PM Narendra Modi today pic.twitter.com/IVWUE0ft7E