స్వదేశంలో ఎలా ఉన్నా..విదేశాల నుంచి సూపర్ సపోర్ట్
X
మణిపూర్ అల్లర్లు బీజెపీని అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. గత కొన్ని రోజులుగా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టాయి. దేశంలో చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ ప్రధాని మోదీకి అమెరికా నుంచి మాత్రం ఎవరూ ఊహించినట్టుగా మద్దతు లభించింది.
మణిపూర్ అంశం మీద ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నానంటూ అమెరికన్ ప్రముఖ సింగర్ మేరీ మిల్బెన్ నుంచి మద్దతు లభించింది. అవిశా్వాస తీర్మానం మీద నిన్న ప్రధాని మాట్లాడారు. అది ముగిసిన కొద్దిసేపటికే మిల్బెన్ ట్వీట్ చేశారు. భారత ప్రజలకు తమ నేత మీద నమ్మకం ఉంది. మణిపూర్, భారత్ లోని మహిళలు, కూతుర్లకు న్యాయం ఎప్పుడూ అందుతుంది అని అన్నారు మెల్బెన్. ప్రధాని మోదీ ఎప్పుడూ ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసమే పోరాడుతారని ఆమె వ్యాఖ్యానించారు. విపక్షాలు అనవసరంగా గొవడ చేస్తున్నాయని మిల్బెన్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతో పాటూ ప్రధాని మోదీ మీద తనకు విశ్వాసం ఉందని, ఆయన కోసం ప్రార్ధిస్తన్నాని అన్నారు మిల్బెన్. చివరలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన కోట్ ను కూడా రాసుకొచ్చారు.
కొన్నాళ్ళ క్రితం ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు మేరీ మిల్బెన్ భారత జాతీయగీతం జనగణమనను పాడారు. మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మిల్బెన్ జనగణమనతో పాటూ ఓం జై జగదీశ హరే కూడా పాడారు.