యువకుడి కడుపులో గర్భసంచి.. రాష్ట్రంలో ఇదే ఫస్ట్ కేసు
X
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి.. కొన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయాలని సూచించారు డాక్టర్లు. వెంటనే సర్జరీ మొదలుపెట్టిన డాక్టర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ యువకుడి కడుపులో గర్భసంచిని చూసి డాక్టర్లు కంగుతిన్నారు. ఈ విషయం యువకుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి పర్మిషన్‌తో గంటన్నర పాటు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే మొదటి కేసుగా నమోదైన ఈ కేసు.. ఇలాంటివి ప్రపంచంలో 300వ కేసులు ఉండొచ్చని సర్జరీ చేసిన డాక్టర్లు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. తన జబ్బు నయం కాకపోవడంతో గత నెల సెప్టెంబరు 25న ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు చేసిన డాక్టర్ల బృందం యువకుడి కడుపులో మహిళ మాదిరిగా గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, యువకుడి హెర్నియా కూడా సరైన స్థానంలో లేదని తెలిసింది. ధామ్‌తరి మాస్టర్ ఆఫ్ సర్జన్ డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ్ సర్జరీ మొదలెట్టగా.. యువకుడి కడుపులో ఉన్న గర్భసంచిని చూసి షాక్ అయ్యారు. . దాదాపు గంటన్నర శ్రమించి సర్జరీ ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని.. మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని తెలిపారు.
ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా జాప్యం చేస్తే భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉండేదని సర్జరీ చేసిన డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని.. ప్రపంచంలో ఇలాంటివి 300 కేసులు ఉండవచ్చని చెప్పారు. సాధారణంగా పుట్టుక సమయంలోనే వీటిని గుర్తిస్తామని.. ఆరేళ్ల వయసులోపే ఆపరేషను చేసి నయం చేస్తామన్నారు. గ్రామాల్లో మంత్రసానులు ప్రసవం చేస్తే ఈ ముప్పును గుర్తించరని వివరించారు.