Home > జాతీయం > పొడవాటి జట్టు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్

పొడవాటి జట్టు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్

పొడవాటి జట్టు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్
X

ఆడవాళ్లు అందానికి ఎంత ప్రధాన్యం ఇస్తారో తెలిసిందే. అందులో ముఖ్యంగా జట్టుపై ఎక్కవ కేర్ తీసుకుంటారు. జట్టు ఒత్తుగా పెరగాలని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కాస్త జుట్టు రాలినా.. కంగారుపడతారు. పొడవు పెరగడానికి చేయని ప్రయత్నం ఉండదు. అలాంటిది ఉత్తరప్రదేశ్ కు చెందిన 46 సంవత్సరాల స్మిత శ్రీవాత్సవ తన పొడవైన జట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టింది. ఏకంగా 7 అడుగుల 9 అంగుళాల పొడవున్న జుట్టును పెంచి రికార్డ్ సృష్టించింది. జుట్టు పొడవుగా ఉంటే సరిపోదు.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఆమె పడ్డ కష్టాలు మామూలుగా లేవు. ఈ పొడవాటి జుట్టును పెంచుకునేందుకు స్మిత 14 ఏళ్లు కష్టపడిందట. 14 ఏళ్ల నుంచి కత్తిరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.

ఆ కాలం సినీ నటీమణులు పొడవైన జడలు కలిగి ఉండటం చూసిన స్మిత.. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆమె జుట్టును పెంచడం మొదలుపెట్టింది. తర్వాత గిన్నిస్ రికార్డ్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. వారానికి రెండుసార్లు తల స్నానం చేసేది. దానికోసం 3 గంటలు కష్టపడేది. కావాల్సినప్పుడు బ్యూటీ పార్లర్ వెళ్లి జట్టుకు కావాల్సిన కేర్ ట్రీట్మెంట్ తీసుకునేది. ఇన్నేళ్లకు స్మిత కల నెరవేరినందుకు ఆనందం వ్యక్తం చేస్తుంది. అందుకు తన జుట్టుపై ఆమె పెట్టిన శ్రద్ధ, అంకిత భావమే కారణం.






Updated : 30 Nov 2023 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top