Home > జాతీయం > సహజీవనానికి ఇది తప్పనిసరి.. లేదంటే 6 నెలల జైలు శిక్ష

సహజీవనానికి ఇది తప్పనిసరి.. లేదంటే 6 నెలల జైలు శిక్ష

సహజీవనానికి ఇది తప్పనిసరి.. లేదంటే 6 నెలల జైలు శిక్ష
X

ప్రస్తుతం దేశంలో ఫారిన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. దుస్తుల దగ్గర నుంచి జీవన విధానం వరకు.. చాలామంది ఫారిన్ కల్చర్ ను ఫాలో అవుతుంటారు. అదే బాటలో నడుస్తూ.. ఈ మ్యధ్య చాలామంది యువత సహజీవనాన్ని మొదలుపెట్టారు. పెళ్లి, కుటుంబ బాధ్యతలకు నో చెప్తూ.. సహజీవనానికి ఆసక్తి చూపిస్తున్నారు. నచ్చిన వ్యక్తితో నచ్చినట్లు ఉండొచ్చనే భావనలో.. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని లెక్కజేయకుండా లివిన్ రిలేషన్షిప్ ట్రెండ్ ను అనుసరిస్తున్నారు. అయితే కొందరు యువత తీరును సమర్థిస్తుంటే.. మరికొందరు భారతదేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని వారిపై మండిపడుతుంటారు. ఈ నేపథ్యంలో యువతలో మార్పు తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఓ రూల్ ను తీసుకొచ్చింది. మంగళవారం జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో.. అక్కడి ప్రభుత్వం లివిన్ రిలేషన్షిప్ పై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ బిల్ ప్రకారం ఎవరైతే సహజీవనం చేస్తున్నారో.. సహజీవనం చేయాలనే ప్లాన్ లో ఉన్నారో.. వాళ్ల రిలేషన్షిప్ గురించి తప్పకుండా జిల్లా అధికారి వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 21ఏళ్ల తక్కువ వయసున్న వారు సహజీవనం చేయాలనుకుంటే.. తల్లిదండ్రుల సమ్మతి అవసరం అని తెలిపింది. ఈ నిబంధనని కచ్చితంగా పాటించాలని, లేదంటే.. 6 నెలల జైలు శిక్షతో పాటు, రూ.25 వేల జరిమానా చెల్లించాలని తెలిపింది. సీక్రెట్ గా సహజీవనం చేసినా.. వారికి శిక్ష తప్పదు. వారికి రూ.10వేల జరిమానా, 2 నెలల జైలు శిక్ష విధించనున్నారు. ఈ రూల్ ప్రకారం సహజీవనంలో మనస్పర్థలు వచ్చినా.. సదరు వ్యక్తి మోసం చేసినట్లు అనిపించినా కోర్టును ఆశ్రయించొచ్చు. మెయింటెనెన్స్ క్లెయిమ్ కూడా చేయొచ్చు.

Updated : 6 Feb 2024 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top