Home > జాతీయం > లాంగ్ లీవ్లో ఉన్నోళ్లకు వాలంటరీ రిటైర్మెంట్.. టీచర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం..

లాంగ్ లీవ్లో ఉన్నోళ్లకు వాలంటరీ రిటైర్మెంట్.. టీచర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం..

లాంగ్ లీవ్లో ఉన్నోళ్లకు వాలంటరీ రిటైర్మెంట్.. టీచర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం..
X

గవర్నమెంట్ టీచర్లకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఏండ్ల తరబడి స్కూల్కు రాకుండా ఎగ్గొడుతున్న ఉపాధ్యాయులకు దిమ్మదిరిగే నిర్ణయం ప్రకటించింది. లాంగ్ లీవ్ లో ఉన్న టీచర్లతో స్వచ్చంద పదవీ విరమణ చేయించాలని నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

6 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం నుంచి స్కూళ్లకు రాకుండా డుమ్మా కొడుతున్న టీచర్ల లిస్ట్ తయారు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆ జాబితా ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా విధులకు హాజరుకాని ఉపాధ్యాయుల సంఖ్య దాదాపు 150 మంది వరకు ఉంది. వారందరితో వాలంటరీ రిటైర్మెంట్ చేయించి ఆ స్థానంలో కొత్త వారిని నియమించనున్నట్లు తెలుస్తోంది.

మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో పనిచేసే టీచర్లలో చాలా మంది డ్యూటీలకు డుమ్మాకొడుతున్నారట. సుదూర ప్రాంతాలు కావడం, రాకపోకలకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది ఉద్యోగాల్లో చేరాక లాంగ్ లీవ్ పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. మరికొందరు లీవ్ వితౌట్ పే ఆప్షన్ కింద ఏండ్ల తరబడి జీతం లేని సెలవులు తీసుకుంటున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశమున్నా చాలా మంది జీతం తీసుకోని టీచర్లు అలా చేయకుండా సెలవులపై వెళ్తున్నారు.

దివ్యాంగులైన ఉపాధ్యాయులకు మాత్రం ఈ నిర్ణయం నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మరోవైపు డిప్యూటేషన్పై ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న టీచర్లకు అందులోనే కొనసాగేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని మంత్రి చెప్పారు. ఫలితంగా వారి స్థానంలో కొత్తవారిని నియమించుకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని టీచర్ల యూనియన్లు స్వాగతించాయి.

Updated : 10 Jun 2023 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top