సుప్రీ కోర్టులో కలకలం.. విచారణకు హాజరైన మృతుడు !
X
సుప్రీం కోర్టులో జరిగిన ఓ హత్య కేసు విచారణలో కలకలం రేగింది. హత్యకు గురైన ఓ పదకొండేళ్ల బాలుడు ప్రత్యక్షం కావడంతో అందరూ కంగుతిన్నారు. తర్వాత విషయం తెలుసుకుని భారంగా నిట్టూర్చారు. ఈ కేసును మరింత లోతుగా జరపాలని కోర్టు ఆదేశించింది. లాయర్లను, జడ్జీలను కంగారు పెట్టిన ఈ కేసు వివరాలు..
ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన అభయ్ కుమార్ సింగ్ అనే బాలుడి తల్లి 2013లో హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం భర్త కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. తర్వాత బాలుడు తాత, మేనమామల దగ్గరికి చేరుకున్నాడు. తన కూతురిని హత్య చేశాడని బాలుడి తాత అల్లుడిపై కేసు పెట్టాడు. పిల్లాడిని ఎవరి కస్టడీలో ఉంచాలన్న వివాదం కోర్టుకు చేరింది. గొడలువు పెరిగాచయి. తన కొడుకును తాత, మేనమామలు చంపేశారని తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అది తప్పుడు కేసని బాలుడి తాత, మేనమాలు అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆ కేసు కొట్టేయడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జడ్జి ఈ కేసును విచారిస్తుండగా బాలుడు హాజరయ్యాడు. ‘‘నేను బతికే ఉన్నాను సార్. మా తాతయ్య బాగా చూసుకుంటున్నాడు. పోలీసులు మా తాతను, అమ్మమ్మను బెదిరిస్తున్నారు. నేను వాళ్ల దగ్గరే ఉంటాను. ఈ కేసును క్లోజ్ చేయండి’’ అని కోరాడు. పిల్లాడు లక్షణంగా బతికి ఉంటే హత్య కేసు ఎలా పెట్టారని కోర్టు యూపీ ప్రభుత్వాన్ని, పిలిభిత్ జిల్లా పోలీసులను నిలదీసింది. నూరియా స్టేషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసి విచారణకు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.Utter philibhith boy appeared court and said he is alive