Valentines day Week 2024 : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారంలో కిస్ డే, హగ్ డే, రోజ్ డే, టెడ్డీ డేలు ఎప్పుడెప్పుడంటే?
X
ఫిబ్రవరి నెల వచ్చిందటే ప్రేమికులకు పండగే. ఎందుకంటే.. ప్రేమ పక్షులకు ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ డే వచ్చేది ఈ నెలలోనే కాబట్టి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ వీక్.. రేపటి నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి 14వ తేదీ వరకు, ఈ ఏడు రోజులు.. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. దీనికోసం ఈ ఏడు రోజులు ప్రేమికులు రకరకాలుగా తమ ప్రేమను తెలుపుతుంటారు. ప్రతి రోజు రొమాంటిక్ ఎమోషన్స్ తో.. ప్రేమికులను సర్ఫ్రైజ్ చేస్తుంటారు. రోజ్ డే (ఫిబ్రవరి 7) రోజున గులాబీలను ఇచ్చి పుచ్చుకునే దగ్గరనుంచి.. ప్రామిస్ డే (ఫిబ్రవరి 11) వరకు ఒకరికొకరు ప్రామిస్లు చేసుకుంటారు. ఒక్కోరోజును ఒక్కోలా.. ఈ వారం మొత్తం ప్రత్యేకంగా జరుపుకుంటారు. దానికోసం ఎక్కువ కష్టపడకుండా.. ఈ వాలెంటైన్స్ వీక్ మీకోసం. ప్రేమికుల రోజును జరుపుకునేందుకు సిద్ధమవుతోన్న ప్రేమికులకు.. రాబోయే వీక్ లో వచ్చే రోజుల్లో ఏయే రోజుకు ఏలా జరుపుకోవాలో ఓ లుక్కేయండి..
రోజ్ డే (ఫిబ్రవరి 7):
రోజ్ డేతో వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. ఈరోజు.. ప్రేమికులకు కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ రోజున ప్రేమికులు తమ ప్రేమిను తెలిపేందుకు గులాబీలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇలా పంచుకునే గులాబీల్లో ఒక్క గులాబీకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఎరుపు గులాబీలు ప్రేమను సూచిస్తాయి. పసుపు స్నేహం, తెలుపు శాంతి లాంటి వాటికి చిహ్నాలుగా ఉంటాయి. ఒకరికొకరు గులాబీలు పంచుకోవడం అనేది.. వికసించే భావోద్వేగాల నాందిగా నిలుస్తుంది.
ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8):
ప్రపోజ్ డే రోజున తమ ఫీలింగ్స్ ను ఇతరులకు షేర్ చేసుకుంటారు. ప్రేమ వికసించే ఈ రోజును.. చాలామంది గొప్పగా జరుపుకుంటారు. ప్రపోజ్ డే అనేది భావోద్వేగపూరితమైన వేడుకను సూచిస్తుంది.
చాక్లెట్ డే (ఫిబ్రవరి 9):
“జీవితం చాక్లెట్ పెట్టె లాంటిది” అనే ఓ సామెత ఉంది. ప్రేమలోని మాధుర్యాన్ని, తీపికి ప్రతీకగా చాక్లెట్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున తమకు ఇష్టమైన వారికి చాక్లెట్ బాక్స్ ను గిఫ్ట్ గా ఇస్తుంటారు. చాక్లెట్ బంధాన్ని బలంగా చేస్తుందని అంటుంటారు.
టెడ్డీ డే (ఫిబ్రవరి 10):
మామూలుగా టెడ్డీ బేర్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఆప్యాయతను గుర్తు చేయడానికి మీ ప్రియమైన వ్యక్తికి టెడ్డీని బహుమతిగా ఇవ్వడం టెడ్డీ డే ప్రాముఖ్యత. ఆనందాన్ని పంచడానికి, మీ ప్రత్యేక వ్యక్తిని ప్రేమలో ముంచెత్తడానికి ఈ టెడ్డీ డే ఒక ప్రత్యేకమైన రోజన్నమాట.
ప్రామిస్ డే (ఫిబ్రవరి 11):
చిన్నా పెద్దా వాగ్దానాలతో సంబంధాలు బలంగా మారతాయి. ప్రేమికులు తమ మధ్య నమ్మకం, అవగాహనను పెంచుకునేందుకు ప్రామిస్ డే జరుపుకుంటారు. ఇది చేసిన వాగ్దానాల గురించి గుర్తుచేసే రోజు.
హగ్ డే (ఫిబ్రవరి 12):
కొన్నిసార్లు భావాలను మాటల రూపంలో చెప్పలేం. అలాంటి టైంలో ఓ ఆప్యాయమైన కౌగిలింత ఎన్నో పదాలను చెప్తుంది. అందుకు వాలెంటైన్స్ వీక్ లో హగ్ డేను జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారిని కౌగిలించుకుని, ఆప్యాయతను వ్యక్తపరచండి.
కిస్ డే (ఫిబ్రవరి 13):
చివరి రోజైన కిస్ డే రోజును మీ ప్రేమను మధురంగా వ్యక్తీకరించండి. ముద్దు అనేది జంటల మధ్య అభిరుచి, అనుబంధాన్ని తెలుపుతుంది.
వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14):
వాలెంటైన్స్ వీక్ లో ఇది గ్రాండ్ ఫినాలే. మీ ప్రేమను పూర్తిగా వికసింపజేసే రోజు ఇది. ఈ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి. ప్రేమను వ్యక్తం చేస్తూ గ్రీటింగ్ కార్డ్స్ అందించండి. డేటింగ్ కు వెళ్లి ఒకరి గురంచి మరొకరు తెలుసుకోంది.