వాలంటైన్స్ డే ఎఫెక్ట్..భారీగా వాటి అమ్మకాలు
X
ప్రస్తుతం వాలంటైన్స్ డే నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌లో రోజెస్, చాక్లెట్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోయినట్లు డెలీవరి ప్లాట్ బ్లింకిట్ తెలిపింది. ఈ వారంలో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్స్ వినియోదారులు కొనుగోలుచేయగా. ఫిబ్రవరి 9న నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరి చేసినట్ల పేర్కొంది. అలాగే ఫిబ్రవరి 13 రాత్రి నిమిషానికి ఏడు కేకులు ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. వాలెంటైన్స్ డే రోజున తాము ప్రేమించే వారిని స్పెషల్ గా కలుసుకోవాలని, వారికి బహుమానాలు ఇవ్వాలని, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. హైదరాబాద్లో రిసార్ట్స్ ,హోటల్స్, పార్కులు ఎక్కడ చూసినా, ప్రేమ జంటలే కనిపిస్తారు. అటువంటి ప్రేమికుల దినోత్సవం రోజు ఇది విదేశీ సంస్కృతిని, ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించడానికి వీల్లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కడైనా జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేశాయి.
నకిలీ ప్రేమను ప్రోత్సహించే వాలెంటైన్స్ డే ను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఇప్పటికే ప్రకటన చేశారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పోరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు. దేశం కోసం.. ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు.