Vande Bharat : వందే భారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. ఆ రూట్లలో 10 ట్రైన్స్
X
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' సర్వీస్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి స్లీపర్ వెర్షన్‌లోనూ మరో కొత్త ప్రయోగం చేస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ రెండో వారంలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనుంది. మార్చి నెలలో వాటికి సంబంధించిన ట్రయల్ రన్స్ నిర్వహించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఇందులో అత్యాధునిక హంగులతో స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 39 వందే భారత్ చైర్ కార్ వెర్షన్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్లీపర్ రైలులో 16 ఏసీ 1-టైర్ కోచ్‌లు ఉంటాయని రైల్వే తెలిపింది. ఒక్కో రైలులో 850 బెర్తులు ఉంటాయి. కొన్ని రైళ్లలో మరో 4 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు కూడా ఉంటాయని రైల్వే తెలిపింది.
సాధారణ రైళ్లతో పోల్చితే ఈ రైళ్లు 2, 3 గంటలు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకుంటాయి. మొదటగా సుదూర ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నారు. వందే భారత్ స్లీపర్ తొలి రైలును ఢిల్లీ నుంచి ముంబై నగరాల మధ్య ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా, ఢిల్లీ - పాట్నా మార్గాల్లో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం దాదాపు 2 నుంచి 3 గంటల వరకూ తగ్గనుంది.