Home > జాతీయం > సరికొత్త లుక్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

సరికొత్త లుక్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

సరికొత్త లుక్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
X

ఇప్పటివరకు మనకు తెలుపు, నీలం రంగులతో పరుగులు తీస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ల రంగు మారింది. కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్‌లు సరికొత్త లుక్‎లో వస్తున్నాయి. ఆరెంజ్, వైట్, గ్రే కలర్స్ కలయికలో కొత్త వందే భారత్ సిద్ధమైంది. శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి వెళ్లి వందేభారత్ ఎక్స్‎ప్రెస్‌లను పరిశీలించారు. ఐసీఎఫ్‌ సీనియర్ అధికారులతో కలిసి కొత్త తరం హై-స్పీడ్ రైళ్ల ఉత్పత్తిని దగ్గరుండి చూశారు. ఈ మేరకు కొత్త వందేభారత్ పోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కొత్త రంగులతో రైలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

వందేభారత్ రైలులో ఇప్పటివరకు 25కి పైగా మార్పులు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్రివర్ణ పతాకం నుంచి కొత్త రంగును తీసుకున్నట్లు వివరించారు. అన్ని వారసత్వ మార్గాల్లో ప్రయాణించే రైలును త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ రైళ్లకు ‘హెరిటేజ్ స్పెషల్’ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి ప్రధాన కార్యాలయంలో దక్షిణ రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు, స్టేషన్ల పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, వేగాన్ని పెంచే పనులు, రైళ్ల టైమ్‌టేబులింగ్ మొదలైన వాటిపై చర్చించారు. జోన్‌ పనితీరుపై దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సింగ్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడంపై మంత్రి ప్రశంసించారు. అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Updated : 9 July 2023 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top