జ్ఞానవాపి మసీదు కేసు.. కార్బన్ డేటింగ్కు కోర్టు అనుమతి
X
దేశంలో సంచలనం సృష్టించిన జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం (జులై 21) వారణాసి జిల్లా కోర్టులో జరిగిన విచారణలో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.
వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో (వాజూ ఖానా మినహా).. కార్బన్ డేటింగ్ నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు హిందూ ప్రతి నిధుల తరుపున వాదనలు విన్న కోర్ట్.. ఏఎస్ఐ సర్వేకు అనుమతిచ్చింది. జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ శివాలయం ఉందని హిందూ సంఘాల వాదన. అంతేకాకుండా మసీదులోని వాజూ ఖానా సమీపంలో ఉన్న శివలింగం ఆకారం కూడా గుడిలోదని వాదనలు వినిపించారు.
కోర్టు అనుమతి ప్రకారం.. మసీదు సముదాయంలో సీల్ చేసిన వాజు ఖానా మినహా మిగతా చోట్లంతా సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ఆగస్టు 4 కల్లా పూర్తవుతుందని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ భావిస్తుంది. ఈ క్రమంలో ఈ కేసు విచారణ మరోసారి ఉన్నత న్యాయస్థానం దాకా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.