Home > జాతీయం > రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీకి ఆహ్వానం

రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీకి ఆహ్వానం

రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీకి ఆహ్వానం
X

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరో నెల రోజుల్లో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 2024 జనవరి 22వ నిర్వహించే ఈ క్రతువుకు హాజరుకావాలంటూ ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. ఆలయ ట్రస్టు సభ్యులు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడకు ఆహ్వానం పంపిన ఆలయ ట్రస్టు.. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషిలను మాత్రం పిలవలేదు. వయసు దృష్ట్యా ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పారు. ఆలయ ట్రస్టు చేసిన అభ్యర్థనకు అద్వానీ, జోషీ ఓకే చెప్పారని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ చెప్పారు.

అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను ఆలయ ప్రారంభోత్సవానికి రావద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగింది. రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలంటూ వీహెచ్పీ సభ్యులు మంగళవారం ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు ఆహ్వానం అందజేసింది. అయితే వృద్దాప్యం దృష్ట్యా రామ మందిర ప్రారంభానికి రావద్దని ఆలయ ట్రస్ట్ సోమవారం చెప్పడం, 24 గంటలు గడవక ముందే వీహెచ్పీ నుంచి ఆహ్వానం అందడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated : 19 Dec 2023 1:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top